అన్నదానం మహా దానం: సర్పంచ్

నవతెలంగాణ- తల్లాడ

మండల కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే వారికి మధ్యాహ్నం భోజనం అందించాలని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సాధన కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం అనుసరణీయమని, మంగళవారం అన్నదాన కార్య క్రమంలో పాల్గొని తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభినందించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి 30 రోజులు అయినా సందర్భంగా సర్పంచ్ పాల్గొని అన్నదానం చేశారు. సాధన కమిటీ అధ్యక్షుడు మోదుగు ఆశీర్వాదం ,సభ్యులు బోనాసి శ్రీనివాసరావు, గొల్లమందల దేవా తదితరులు పాల్గొన్నారు.
Spread the love