సర్వేంద్రియానాం నయనం ప్రధానం

‘సర్వేంద్రియానం నయనం’ అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా కళ్ళ సమస్యలతో బాధపడేవారిని చూస్తున్నాం. పది మందిలో నలుగురు కంటి అద్దాలు ధరించే వారే ఉన్నారు.
కళ్ళ ఇన్ఫెక్షన్‌ – సైట్‌ ప్రాబ్లమ్స్‌ : దూరం చూపు, దగ్గర చూపు లోపం, రేచీకటి వంటి సమస్యలు చిన్న పెద్ద వయస్సుల తేడా లేకుండా ఇబ్బందికి గురైవుతున్నారు. చాలా ఎక్కువ ఇంటెన్సిటి ఉన్న లైట్‌కి (కాంతి దీపాలు) ఎక్స్‌ పోజ్‌ అవ్వడం వలన కంటి రెటీన దెబ్బతింటుంది. దీని వల్ల రేటీన సమస్యలు వస్తాయి. లైట్స్‌ వలన వచ్చే సమస్యలను solar retinopathy అంటారు.
Electronic devices ని ఎక్కువ సమయం వాడటం, ఉదా: phone, tablets and gaming systems ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇవి దీర్ఘకాలం ఎక్కువ సమయం వాడితే కంటి చూపు మీద ప్రభావితం చేస్తాయి. (మానవుని కన్ను 380 నుండి    కాని చాలా బలమైన లైట్‌)
సూర్యకాంతి పెరుగుదల మానసిక వికాసానికి సహకరిస్తుంది. అంతేకాదు, పిల్లల కంటి చూపు పెరుగుదల ముఖ్యమైనది.
500 nanometre range సర్వే ప్రకారం 80% సూర్యకాంతి కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ డివైస్‌ కి ఎక్స్‌ ఫోజ్‌ అవ్వడం… అది కూడా ప్రతి రోజు 2 గంటల కంటే ఎక్కువగా ఉండటం వలన చిన్న పెద్ద తేడా లేకుండా 59% డిజిటల్‌ స్ట్రెయిన్‌ లక్షణాలతో ఉన్నారు.
సాధారణంగా ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌ బ్రైట్‌ నెస్‌ తగ్గించడం ఉత్తమ మార్గం. ఎక్కువగా వాటిని దగ్గరగా చూడకపోవడం మంచిది. కనీసం మూడు మీటర్ల దూరంతో టెలివిజన్‌ చూడాలి.electronic devices, smart phonesగంటల తరబడి వాడకూడదు.
కళ్ళ ఆరోగ్యానికి పోషక ఆహారం : విటమన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ల్యూటిన్‌, జియా జాంతిన్‌, ఒమేగా-3, ప్యాటి యాసిడ్స్‌ కంటి ఆరోగ్యానికి రక్షణగా ఉంటూ ఇన్ఫెషన్స్‌ రాకుండా కాపాడుతాయి. క్యారెట్‌, చిలగడ దుంపలు, పాలకూర, మటన్‌ లివర్‌ వంటి ఆహార పదార్థాలలో విటమిన్‌ ఎ ఎక్కువగా వుంటుంది.
ఒమేగా-3 ప్యాట్స్‌: సాల్మన్‌ చేప, సజ్జ గింజలు, అవిసె గింజలు.
ల్యూటిన zeaxanthin : ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్‌ సి : ఇది కళ్ళలో రక్త నాళాల ఆరోగ్యానికి సహకరిస్తుంది. విటమిన్‌ సి ఎక్కువగా వుండే జామ, స్ట్రాబెర్రీలు, నారింజ, నిమ్మ, ఉసిరి, టమాటో, క్యాబేజి, బ్రొక్కోలి వంటివి.
విటమిన్‌ ఇ: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు ఉత్తమం.
– పి.వాణి, 9959361180

Spread the love