మండలఎంపీడీఓ క్రాంతి కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆయా గ్రామాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పత్రాలను బుధవారం పరిశీలించునట్లుగా మండల ఎంపీడీఓ క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మండలంలో కేటగిరీ-1 (ఏ బి) కింద 17 మంది, కేటగిరీ-ఐఐఐ కింద 35 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా వెల్లడించారు. దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ పత్రాలతో దరఖాస్తు ఫారాలతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు లబ్దిదారులకు సమాచారం అందించి, సకాలంలో హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమానికి తహసీల్దార్ తోపాటు బ్యాంక్ అధికారులు కూడా హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు.
రేపు ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



