ప్రథమ చికిత్సల పేర్లతో విచ్చలవిడిగా క్లీనిక్ లు

– మద్నూర్ ఉమ్మడి మండలంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి లే ప్రత్యేక రోగాల పేరిట ఇంజక్షన్లు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల్లో ప్రథమ చికిత్సల పేర్లతో విచ్చలవిడిగా ఆర్.ఎం.పి పి.ఎం.పి క్లినిక్లు ఏర్పాటు చేసుకొని పెద్దపెద్ద రోగాలకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. ప్రథమ చికిత్స చేయడమే కష్టం అనుకుంటే ప్రతి ఒక్కరు క్లినిక్ పేరుతో దవఖాన పెట్టుకుంటూ ఒక్కొక్క క్లినిక్ వద్ద ఒక్కొక్క మెడికల్ షాపు పెట్టుకుంటూ ఎలాంటి రోగానికైనా విచ్చలవిడిగా మందులు రాసి ఇవ్వడం, బలం లేదంటూ టానిక్ మందులు ఇవ్వడం ఒక్కెత్తుగా కొనసాగుతుంటే.. మరోరకంగా ఈ మండలంలో ఎంబిబిఎస్ ఎండి ఎంఎస్ లాంటి డాక్టర్లు ఇవ్వలేని కోర్సులకు ప్రత్యేకంగా చికిత్సలు అందిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులకు వాతం సూదులు అంటూ, అదే కాకుండా కామెర్ల ప్రత్యేక చికిత్సల పేర్లతో ఇంజక్షన్ ఇస్తున్నారు. ఒక్కొక్క రోగి వద్ద వేలాది రూపాయలు లాక్కుంటున్నారు. మద్నూర్ ఉమ్మడి మండలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని కామారెడ్డి జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉండటం మహారాష్ట్ర కర్ణాటక కు పూర్తిగా సరిహద్దులో ఉండటం, ఈ ప్రాంతానికి ఏ ఒక్క జిల్లా అధికారి పకడ్బందీగా తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం, ప్రథమ చికిత్సల పేర్లతో క్లినిక్లు పెట్టుకుంటూ.. ఒక్కొక్కరు ఒక్కొక్క మెడికల్ షాపు తెరుచుకుంటూ, రోగం తెలియని ప్రథమ చికిత్స క్లినిక్ కేంద్రాల వారు డాక్టర్లుగా చలమని అవుతున్నారు. విచ్చలవిడిగా ఏరోగానికి ఏ మందులు ఇవ్వాలి తెలియకుండానే మెడికల్ షాపులు ప్రారంభిస్తున్నారు. ఒక్కొక్క రోగికి తెలిసి తెలియని మందులు రాయడం వేలాది రూపాయలు లాక్కుంటూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.
ఫార్మాసిస్టు కోర్సు చేయకుండానే  బోకస్ పట్టాలతో మెడికల్ షాపులు నడిపిస్తున్నారు. ఫార్మసిస్ట్ కోర్సు పేరుతో పట్టాలు అద్దెకు తీసుకుంటూ నడిపిస్తున్నట్లు సమాచారం. ప్రథమ చికిత్స నిబంధనలు ఉల్లంఘిస్తూ నడిపించే ఆర్ఎంపి పి.ఎం.పి డాక్టర్లతో చలమణి అవుతున్న వారి పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి అసలు ప్రథమ చికిత్స కు అర్హులా కాదా మెడికల్ షాపు పెట్టారు. అంటే దానికి ఫార్మాసిస్టు కోర్సు చేశారా లేదా లేక అద్దెకు నడిపిస్తున్నారా సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా మెడికల్ షాపుల్లో బోకస్ పట్టాలతో నడిపించే షాపులపై ఏ ఒక్క రోజైనా తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లా అధికారులకు పీఎంపీ ఆర్.ఎం.పి డాక్టర్ల యూనియన్ పరంగా నెల నెల మామూలు కట్టబెడతారని ఆరోపణలు ఉన్నాయి. మద్నూర్ ఉమ్మడి మండల ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ప్రథమ చికిత్సల పేర్లతో నడిచే క్లినికల్ పట్ల ప్రజలకు మోసాలు జరుగుతున్న పట్టించుకునే నాధుడే లేరని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఎంఎస్ ఎండి కోర్సులు చేసిన డాక్టర్లే కామెర్లు చికిత్సకు అలాగే మోకాళ్ళ నొప్పులకు ఇంజక్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉండగా అలాంటి భారీ నొప్పులకు ఈ ఉమ్మడి మండలంలో ప్రత్యేక చికిత్సలు అందించడం కొనసాగుతున్నప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ తనిఖీలు చేపట్టడం లేక చికిత్సల పేరుతో ఒక్కొక్క రోగి వద్ద వేలాది రూపాయలు దండుకుంటున్న పి.ఎం.పి ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స చేపట్టే వారికి డాక్టర్లు కూడా పేరు పెట్టుకోవద్దు అంటూ నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ డాక్టర్లు గా చెలమని అవుతున్నారు. రోగం తెలియకపోయినా ప్రతి దానికి సైలెన్లు ఎక్కించి  వేలాది రూపాయలు లాక్కుంటున్నారు. ఇక్కడ కొనసాగే ప్రథమ చికిత్స కేంద్రాల పట్ల మెడికల్ షాపుల పట్ల ప్రత్యేకంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేపట్టాలని అక్రమంగా కొనసాగించే వారి పట్ల చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Spread the love