నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ విడుదల చేసింది. సీడబ్య్లూసీ సమావేశాలను పురస్కరించుకుని ఈనెల 16,17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించబోయే సమావేశాలు, సభలు, కార్యక్రమాల వివరాలను ఈమేరకు బుధవారం వెల్లడించింది. 16న మధ్యాహ్నం భోజనానంతరం రెండు గంటలకు సీడబ్య్లూసీ సమావేశం ప్రారంభం కానుంది. 17న సీడబ్య్లూసీ విస్తృత సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో సీడబ్య్లూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ఆఫీస్‌బేరర్లు హాజరుకానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయభేరి సభలో పాల్గొంటారు. అంతకు ముందు మెగా ప్రదర్శన ఉంటుంది. ఆ సభలో ఐదు హామీలను ఇస్తారు. 18న ఉదయం కార్యకర్తల సమావేశం… ఆ తర్వాత డోర్ టు డోర్ ఐదు హామీల కరపత్రాల పంపిణీ. దీంతోపాటు బీఆర్ఎస్ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం కార్యకర్తలతో కలిసి సమూహిక భోజనాలు, సాయంత్రం గాంధీ, అంబేద్కర్, కొమురంబీమ్ విగ్రహాల వద్ద భారత్ జోడో మార్చ్ నిర్వహిస్తారు. సీడబ్య్లూసీ సమావేశాల నిర్వహణకు పలు కమిటీలను నియమించింది. ఆహ్వాన కమిటీ చైర్మెన్‌గా రేవంత్‌రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మెన్ శ్రీధర్‌బాబు, రవాణా కమిటీ చైర్మెన్‌గా బి మహేష్‌కుమార్‌గౌడ్, పబ్లిసిటీ మరియు బ్రాండింగ్ కమిటీ చైర్మెన్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ చైర్మెన్‌గా మహ్మద్ అజరుద్దీన్, ప్రొటోకాల్ కమిటీ చైర్మెన్‌గా హర్కర వేణుగోపాల్‌తోపాటు ముఖ్య నాయకులను సభ్యులుగా నియమించింది.
కరీంనగర్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి హామీ ఇవ్వండి మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌కు కొనగాల మహేష్ వినతి
వచ్చే ఎన్నికల హామీల్లో కరీంనగర్‌కు ఎయిర్‌పోర్టు ఇస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి హామీ ఇవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ శ్రీధర్‌బాబును కోరారు. ఈమేరకు బుధవారం గాంధీభవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా ప్రభుత్వ ఇంజినీరింగ్, ఐటీఐ కళాశాలను ఏర్పాటుకు మ్యానిఫెస్టోలో పొందుపరచాలని కోరారు. మున్నురుకాపు కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు బడ్జెట్ పెంపుదల తదితర హామీలను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.