నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు ఇటీవల మరమ్మత్తుల పేరుతో ప్రహారిని కూల్చివేయగా విద్యార్థులకు అది ప్రమాదకరంగా మారింది. మండల సమావేశంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు దీని విషయంలో ప్రస్తావించగా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. సాఠాపూర్ ఫారం వీరన్న గుట్ట ఈ పాఠశాలలో తెలుగు మీడియం తో పాటు, ఉర్దూ మీడియం విద్యార్థులు వివిధ గ్రామాల నుంచి విద్యను అభ్యసించడానికి వస్తూ ఉంటారు. ప్రధాన రోడ్డు పక్కనే పాఠశాల ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరం లోపు ప్రహరీ నిర్మాణం చేపట్టాలని, లేనియెడల తాత్కాలికంగా పురాహరి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.