అబ్బాపూర్ తండాలో ఘనంగా సీత్ల పండుగ

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్( బి) తండాలో గిరిజన సీత్ల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గిరిజనులంతా కలిసి ఆరాధ్య దైవం సీత్ల దేవతకు ప్రకృతిలో ప్రత్యేక పూజలు చేసి కోళ్లు, మేకలను బలి చేసి వాటిపై నుండి పశువులను దాటించారు. తండాలో మహమ్మారి లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండడం, పశు సంపద పెరిగి క్రూర మృగాల నుండి కాపాడాలని శిథిలా తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బంధు సమేతంగా భోజనాలను ఆరగించి ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శోభన్, రవి, కోలా పీర్ సింగ్, కైలాష్, సేవల్జీ, బాబు, మధుకర్, మహిళలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు.
Spread the love