కాంగ్రెస్ ప్రభుత్వంలో అమోఘమైన అభివృద్ధిని చేసుకుందాం.. సీతక్క

నవతెలంగాణ- పస్ర: వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో  ములుగు నియోజకవర్గం ను అమోఘమైన రీతిలో అద్భుతంగా అభివృద్ధి పరుచుకుందామని  ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండలంలోనీ  పస్ర, చల్వాయి, మచ్చాపూర్ గ్రామాల్లో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  అధ్యక్షతన క్లస్టర్ ఇంఛార్జిలు జంపాల ప్రభాకర్, తేళ్ల హరిప్రసాద్, పన్నాల ఎల్లారెడ్డి, పులుగుజ్జు వెంకన్న, గ్రామ అధ్యక్షులు సోమసాని నారాయణ స్వామి, వేల్పుగొండ ప్రకాష్, బద్దం లింగారెడ్డి  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించగా అట్టి ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజక వర్గ ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు విచ్చేసి సాగు చేసుకుంటున్న అన్ని వర్గాల ప్రజలకు పట్టాలు అందిస్తామని, రైతులకు ఎకరానికి ప్రతి ఏటా 15000/- రూపాయలు, రైతు కూలీలకు 12000/- రూపాయలు అందిస్తాం అని, రైతులకు క్వింటాకు 500/- రూపాయల బోనస్ అందిస్తాం అన్నారు. మచ్చాపూర్ గ్రామం పోరాటాల గడ్డ అని, వాళ్లకు ఉన్న అతి పెద్ద సమస్య భూదాన్ పట్టాలు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యను పరిష్కరించి మచ్చాపూర్ ప్రజలందరికి పట్టాలు అందిస్తాను అని అన్నారు. అలాగే మచ్చాపూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినవారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చల్వాయి గ్రామంలోని వడ్డెర కుల సంఘం నాయకులతో మాట్లాడిన సీతక్క గారు వారికి కుల సంఘ భవనం నిర్మిస్తా అని, అలాగే చల్వాయి గ్రామంలో భూములు కోల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారికి నష్ట పరిహారం అందిస్తాం అని, లేకపోతే భూమి కోల్పోయిన వారికి భూములు అందజేస్తాం అని అన్నారు. అలాగే పస్ర గ్రామంలోని పాతూరు గ్రామంలో ఉన్న ప్రజలను కలిసి వారికి కాంగ్రెస్ పార్టీ రాగానే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్లస్థలాలు అందించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని అన్నారు. అలాగే అన్ని కులాలు, వర్గాలు సమానమే అని, ఏ ఒక్క వర్గానికి మద్దతు ఇచ్చే వ్యక్తిని కానని, సాగు చేసుకునే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తాం అని అన్నారు. పోడు భూములకు కూడా పట్టాలు అందిస్తాం అని అన్నారు. కెసిఆర్ గారు ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రభుత్వ భూముల్ని దోచుకున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లతో దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ కట్టినం అని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్ గారు నాణ్యత ప్రమాణాలు లోపించి మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ బీటలు వారడం కల్వకుంట్ల వారి అవినీతికి ప్రతీక అని అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి మన తలాపున ఉన్న గోదావరి నీళ్లను తరలించడానికి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాణ్యతతో కట్టకుండా లక్ష కోట్ల రూపాయలు దోచుకుపోయారని అన్నారు. మన బ్రతుకులు మారుతాయి అని, మన కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే మన రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుని మనల్ని మోసం చేసిందని అన్నారు. ఇకనైనా మోస పూరిత వాగ్ధానాలు చేసే నాయకుల్ని నమ్మవద్దని, ఈ దేశ స్వాతంత్య్రం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ స్వరాష్ట్ర కలను తీర్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలయ్యే పథకాలు.రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు. చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అలాగే గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు లబ్ధిదారుల ఎంపికలో బి.ఆర్.ఎస్.పార్టీ వారి కార్యకర్తలను ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను, పార్టీ పథకాలుగా మార్చి పేదల అభివృద్ధికి అడ్డుపడ్డారు అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేసి సాగు చేసే ప్రతి ఒక్కరికీ పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
Spread the love