రాష్ట్ర స్థాయి ఎస్ జీ ఎఫ్ అండర్ 14 వాలీబాల్ బాలా బాలికల ఉమ్మడి నిజామాబాద్ జట్లను సోమవారం గాంధారి మండలంలోని పెట్ సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం లో నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకూ చెందిన బాలురు రెండు బాలికల రెండు జట్లూ ఎంపికలో పోటీల్లో పాల్గొన్నారని కామారెడ్డి జిల్లా ఎస్ జీ ఎఫ్ ప్రధాన కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. ఈనెల 16 నుండి 18వరకు చెగుంటలో జరిగే రాష్ట్ర స్థాయి స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయి ఆయన తెలిపారు. ఎంపికలో లో బాలురు 12 బాలికలు 12 మందిని ఎంపిక చేశారు, కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యయమా ఉపాధ్యాయు సంగం బాధ్యులు విద్య సాగర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్, గంగా మోహన్, శ్రీనివాస్ యాదగిరి, బాలు, తదితరులు పాల్గొన్నారు.