68వ జాతీయ స్థాయి అండర్ 17 బాలికల హాకీ టోర్నమెంట్కు కామారెడ్డి మండలం గర్గుల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల క్రీడాకారులు రణబోయిన ప్రవళిక, కమ్మరి భవానీలు 68వ రాష్ట్ర స్థాయి హాకీ అండర్ 17 బాలికల విభాగంలో నిజాంబాద్ లోని నభ్యభారతి గ్లోబల్ హై స్కూల్ లో ఈనెల 11 నుండి 13 వరకు జరిగిన క్రీడలలో ఎంపిక కావడం జరిగిందనీ ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో రొహుతక్ లో జరిగే హాకీ టోర్నమెంట్ లో పాల్గొనడం జరుగుతుందనీ పేర్కొన్నారు. ఈ క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. ఎల్లయ్య , ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులందరూ క్రీడాకారిణి లను అభినందించారు.