సాఫ్ట్బాల్ పోటీలకు కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

Selection of KGBV student for softball competitionనవతెలంగాణ – ఆర్మూర్ 
ఈనెల 1న సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్ బాల్ ఎంపిక లో కేజీబీవీ కళాశాల  విద్యార్థిని శ్రీనిధి పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈనెల 8 నుండి 10 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ గంగా మణి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాఫ్ట్ బాల్ పోటీలకు కళాశాల విద్యార్థి శ్రీనిధి ఎంపిక రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూజిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి వీణ , ఉపాధ్యాయ బృందం తదితరులు  పాల్గొన్నారు.
Spread the love