సీరియల్ నటుడు ఆత్మహత్య..

నవతెలంగాణ – హైదరాబాద్: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. మణికొండ లో ఆత్మహత్య చేసుకున్న చందు…త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో నటించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది నటి పవిత్ర. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉందని సమాచారం అందుతోంది. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్‌నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్డు నం.20లో ఉన్న అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు వచ్చి చూసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love