రెండు రాష్ట్రాలకు సేవచేయడం పూర్వజన్మ సుకృతం

– ఊరచెరువు అభివృద్ధికి రూ.30 లక్షల కేటాయింపు
– రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ బూసిరెడ్డి శంకర్రెడ్డి
నవతెలంగాణ- బూర్గంపాడు
శ్రీసీతారామచంద్రస్వామి పాదాల చెంత నుంచి ఈ రెండు రాష్ట్రాలకు రోటరీ గవర్నర్‌గా సేవలందించడం పూర్వజన్మ సుకృతమని రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ బూసిరెడ్డి శంకర్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ముత్యాలమ్మ గుడి వద్ద మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏండ్ల నుంచి రోటరీ సేవలో ఉన్నానని, ఈ రోటరీ సేవలో భాగంగా మన ప్రాంతానికి ఇరవెండి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టును రోటరీ ద్వారా చేయించానన్నారు. ఇరవెండి ప్రాంతం మొత్తం బైగ్రావిటీ వాటర్‌ అందుబాటులో ఉందన్నారు. అలాగే తన సొంత గ్రామం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంను బాగు చేయాలన్న ఉద్దేశ్యంతో గతంలో రూ.89 లక్షలతో పైపులైన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం జరిగిందన్నారు. బ్రష్‌ స్కూల్‌కు 2001లో ఫిజియోథెరపీ వాయిస్‌ తరఫున పరికరాలు అందజేశామన్నారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో వందల బోర్లను ఐటీసీ సంజరు సింగ్‌ సహకారంతో ఏర్పాటు చేయించామన్నారు. నా సొంత గ్రామంలో ఊరచెరువును ట్యాంక్బండ్‌ రీతిలో అభివృద్ధి చేయాలని ఎంతో మంది గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారని, ఆ అవకాశం నాకు లభించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఒక హైదరాబాద్‌ క్లబ్‌, ఇంట ర్నేషనల్‌ క్లబ్‌, డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డెసిగేటెడ్‌ ఫండ్‌ ద్వారా గ్రామంలో ఊరచెరువు అభివృద్ధికి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేయించానన్నారు. మే రెండవ వారం నుంచి పనులను మొదలుపెట్టి జూన్‌ కంటే ముందు గానే పనులు పూర్తిచేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఊరచెరువును ట్యాంక్‌ బండ్‌ గా మార్చి చెరువు చుట్టుపక్కల వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తే వాకింగ్‌ కు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సహకారంతో లైటింగ్‌ ఏర్పాట్లు, ఐటీసీ సహకారంతో సిట్టింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని ప్రభు త్వ విద్యాలయాల్లో బాలికలకు మరుగుదొడ్ల సమస్య ఉందని తన దృష్టికి వచ్చిందని ఆ సమస్య నివృత్తి చేసేందుకు పై అధికారులను సంప్ర దించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో విద్యాలయాల్లో బాలిక లకు మరుగుదొడ్లు, డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్లు ఏర్పాటుకు రూప కల్పన చేస్తామన్నారు. అదేవిధంగా ముత్యాలమ్మ గుడి వద్ద ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం రోటరీ తరపున చేపడతామని ఆయన తెలిపారు. ఐటీసీ సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో సూరెడ్డి చంద్రా రెడ్డి, పత్తి వెంకటేశ్వరరెడ్డి, గాదె పెద్దిరెడ్డి, పాలెం రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love