చెపాక్‌లో చెన్నైకు షాక్‌

చెపాక్‌లో చెన్నైకు షాక్‌– భారీ శతకంతో చెలరేగిన స్టొయినీస్‌
– చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో లక్నో గెలుపు
– గైక్వాడ్‌ సెంచరీ వృథా
చెన్నై: చెపాక్‌ స్టేడియంలో ఎదురులేని చెన్నైకు లక్నో జట్టు చెక్‌ పెట్టింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో బ్యాటర్‌ మార్కస్‌ స్టొయినీస్‌(124నాటౌట్‌; 63బంతుల్లో 13ఫోర్లు, 6సిక్సర్లు) ఒంటిచేత్లో మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు కెప్టెన్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అజేయ శతకానికి తోడు.. శివమ్‌ దూబే అర్ధసెంచరీలతో మెరవడంతో సొంతగడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 210పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో ఓపెనర్లు డికాక్‌(0), కెఎల్‌ రాహుల్‌(16) నిరాశపరిచినా.. స్టొయినీస్‌ (124నాటౌట్‌) అజేయ శతకంతో మ్యాచ్‌ను ముగించాడు. చివర్లో పూరణ్‌ (34), హుడా(17నాటౌట్‌) స్టొయినీస్‌కు సహకరించారు. దీంతో లక్నో జట్టు 19.3ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213పరుగులు చేసి సంచలన విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్టొయినీస్‌కు లభించింది. తొలుత చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(108నాటౌట్‌)సెంచరీతో చెలరేగగా.. సిక్సర్ల శివం దూబే(66) తన తరహాలో రెచ్చిపోయాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు టాపార్డర్‌ విఫలమైనా.. గైక్వాడ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రవీంద్ర జడేజా(16)తో మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించిన గైక్వాడ్‌.. దూబే కలిసి చెన్నై స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ సీజన్‌లో ఓపెనింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న చెన్నైకి లక్నో పేసర్‌ హెన్రీ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే ఆఖరి బంతికి అజింక్యా రహానే(1)ను ఔట్‌ చేశాడు. 4పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై.. డారిల్‌ మిచెల్‌(11) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. అయితే.. మొహ్సిన్‌ ఖాన్‌ ఓవర్‌లో జడేజా స్లో డెలివరీని అంచనా వేయలేక వికెట్‌ పారుసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే అండతో గైక్వాడ్‌ మరింత చెలరేగి ఆడాడు. వీళ్లిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో చెన్నై స్కోర్‌ 150 దాటింది. యశ్‌ ఠాకూర్‌ ఓవర్లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదిన రుతురాజ్‌ ఐపిఎల్‌ రెండో సెంచరీని పూర్తి చేసుకు న్నాడు. ఇక మొహ్సిన్‌ ఖాన్‌ వేసిన 19వ ఓవర్లో దూబే సిక్సర్‌తో అర్ధసెం చరీని పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ నాల్గో వికెట్‌కు 104 పరుగులు జోడించడంతో చెన్నై జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 4వికెట్లు నష్టపోయి 210పరు గుల భారీస్కోర్‌ నమోదు చేసిం ది. లక్నో బౌలర్లు హెన్రీ, మొహి సిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

Spread the love