ప్రొఫెషనల్‌ స్క్వాష్‌కు సౌరవ్‌ ఘోషల్‌ వీడ్కోలు

ప్రొఫెషనల్‌ స్క్వాష్‌కు సౌరవ్‌ ఘోషల్‌ వీడ్కోలున్యూఢిల్లీ: భారత స్టార్‌ స్క్వాష్‌ ఆటగాడు సౌరవ్‌ ఘోషల్‌ ఫ్రొఫెషనల్‌ స్క్వాష్‌కు వీడ్కోలు పలికాడు. 37ఏళ్ల సౌరవ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 22ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపాడు. ’22 ఏళ్ల క్రితం నా కెరీర్‌ మొదలైంది. అప్పుడు ప్రొఫెషనల్‌ స్కాష్‌లో సుదీర్ఘ కాలం ఆడతానని అనుకోలేదు. కానీ, ప్రతి దానికి ముగింపు ఉంటుంది. ఫ్రొఫెషనల్‌ స్కాష్‌ అసోసియేషన్‌(పిఎస్‌ఎ)కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా’ అని తెలిపాడు. అయితే, ఇది స్క్వాష్‌కు పూర్తిగా వీడ్కోలు పలికినట్టు కాదని, తాను దేశం తరపున మరికొంత కాలం ఆడతానని పేర్కొన్నాడు. కాగా, ఘోషల్‌ తన కెరీర్‌లో 10పిఎస్‌ఎ టైటిల్స్‌ సాధించాడు. అంతేకాకుండా, టాప్‌-10 వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక భారత ఆటగాడు అతనే. వరల్డ్‌ డబుల్స్‌ చాంపియన్‌షిప్‌-2022లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో సౌరవ్‌ స్వర్ణం సాధించాడు. అదే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌, సింగిల్స్‌ కేటగిరీల్లో కాంస్యం సాధించగా.. ఆసియా క్రీడల్లో టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, సింగిల్స్‌లో రజతం గెలుచుకున్నాడు.

Spread the love