నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడి

– మద్యం మత్తులో నిర్మాణ కార్మికుడి దుర్మార్గం
నవతెలంగాణ-శంషాబాద్‌
మద్యం మత్తులో ఓ కామాంధుడు నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. ఏసీపీ భాస్కర్‌ వేముల తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దండు వెంకటయ్య కొంతకాలంగా శంషాబాద్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం వీడీపీ ప్రయివేట్‌ లేబర్‌ కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. లేబర్‌ పని చేసే కూలీలంతా శంషాబాద్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వెంకటయ్య పీకల దాకా మద్యం తాగి వాళ్ల ఇంటి పక్కన ఉన్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో తల్లి గమనించి ఘటనా స్థలానికి వెళ్ళింది. వెంటనే నిందితుడిని పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో వెంకటయ్యను అరెస్టు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు కర్నాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Spread the love