ఆలస్యంగా వెలుగులోకి
ఇద్దరు నిందితుల
అరెస్టు, రిమాండ్
నవతెలంగాణ- శంకర్ పల్లి
బాలికకు మాయమాటలు చెప్పి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదోవ తరగతి చదువుతున్న బాలికకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆమెతో చనువు పెంచుకున్న యువకుడు.. ఆమెకు మాయమాటలు చెప్పి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే జూన్ 1వ తేదీన మరో యువకుడు సైతం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే రాత్రివేళ బాలిక బయటకు వెళ్లి రావడం, ఒంటిపై గాయాలు చూసిన తల్లి ఆమెను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. దాంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను శంషాబాద్‌లోని భరోసా కేంద్రానికి తరలించి, పరీక్షలు నిర్వహించారు. ఆమెపై ఇద్దరు లైంగికదాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితులపై ఫొక్సో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు.
బాలికపై లైంగికదాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



