ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ 15వ నగర మహాసభ విజయవంతం

– ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ 19 మందితో నూతన కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ 15వ నగర మహాసభ విజయవంతమైందని ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ 19 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెల 27వ తేదీన జరిగిన నగర 15వ మహాసభలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని,ఈ నగర మహాసభల్లో నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష,కార్యదర్శులుగా హస్పే.గణేష్, పోషమైన మహేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా నగర అధ్యక్ష, కార్యదర్శులు హెచ్. గణేష్ పి.మహేష్ తమను ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర అధ్యక్ష,కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీకి, అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీకి విప్లవ అభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పట్ల తమ పోరాటం కొనసాగిస్తామని అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.అలాగే నిజామాబాద్ నగరంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల పుర నిర్మాణం చేపట్టే అంతవరకు, ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత గా పెట్టించేంతవరకు, అలాగే విద్యార్థుల సంఖ్య కనుగొనంగా సంక్షేమ హాస్టల్లో ప్రవేశాల సంఖ్యను పెంచే  వరకు ,అలాగే నిజామాబాద్ నగరంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమాలు చేపడతామని అన్నారు.అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బేరర్స్ గా దీపిక, ఆజాద్, శివ,సందీప్, బాబురావు అలాగే నగర కమిటీ సభ్యులుగా దుర్గా, సుమిత్ర, వీణ,అజయ్ సందీప్, సంతోష్, కార్తీక్,విశాల్, వేణు, సంతోష్, అశ్విని, శైలేష్ , కార్తీక్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు.
Spread the love