ధాన్యం.. దళారుల పాలు..

charset=InvalidCharsetId 6

– 100 కిలోల సంచిలో నల్గున్నార కిలోల తరుగు

– నిండా మునుగుతున్న రైతులు
– కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం.
– బోనస్ లాస్.
– కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
నవతెలంగాణ – మాక్లూర్
రబీ సీజన్ ఆరంభంలో నాట్లు వేసిన రైతులకు ప్రస్తుతం పంట చేతికొస్తోంది. ఒక్క మాక్లూర్ మండలంలో 24318 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఒక్కో ఎకరానికి సగటున 26 క్వింటాళ్ల వరి ధాన్యం చొప్పున మండలం మొత్తం 6,32,268 క్వింటాళ్ల పంట దిగుబడి అయ్యే అవకాశముంది. ఇప్పటికే వరి కోతలు మొదలైయ్యాయి. ఈ ధాన్యాన్ని రోడ్లపై, ఖాళీ మైదానాల్లో కుప్పలుగా పోస్తున్నారు. అయితే వాతావరణంలో మార్పు వల్ల వర్షం పడుతుందేమోనాని, ధాన్యం నానిపోతోందనీ, దానికి తోడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీన్ని అవకాశంగా మలుచుకున్న దళారులు.. గ్రామాలపై పడ్డారు. క్వింటాకు కేవలం రూ. 1900 నుంచి 1950 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో క్వింటాల్లో రైతులు గరిష్టంగా రూ. 253 నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది వరి ఏ గ్రేడు రకానికి రూ.2203, బీ గ్రేడ్కు రూ.2183 ధర నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఎకరాకు రైతులు రూ. 6578 వేల వరకు రైతు నష్టపోతున్నారు. అంటే ఐదు ఎకరాలు ఉన్న మధ్య తరగతి రైతు రూ. 32590 రూపాయలు నష్టపోతున్నాడు. దీనికితోడు 100 కిలోల సంచిలో నల్గున్నర కిలోలు తరుగు పేరిట కోత కోస్తున్నారు.
దళారులకు అమ్ముకున్న వారికి బోనస్ చెల్లదు…
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాల్ కు రూ. 500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ బోనస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు దన్యాన్ని అమ్ముకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే బోనస్ అందుతుంది. అంటే ఎకరానికి రైతు సుమారు రూ. 13 వేలు నష్టపోతున్నారు.
వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ. బోనస్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Spread the love