నేతాజీ నగర్ లో శీత్లా  పండుగ వేడుకలు..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్ గ్రామంలో మంగళవారం బంజారా కులదవమైన శీత్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని, పశువులు జీవాలు మనుషులు అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఇల్లు పిల్ల పాపలతో ధన లాభంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మహిళలు ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో తాతల కాలం నుండి అనాదిగా వస్తున్న ఆచారం అని దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నామని నేతాజీ నగర్ గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పీడ పిశాచం ఉండకుండా కాపాడాలని గ్రామ దేవతలను కోరుకున్నారు. కొబ్బరికాయలు ధూప దీప నైవేద్యాలతో ఆరగింపు చేశారు.  ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్ద నాయక్, మూడు సుగుణ నాయక్, వార్డు సభ్యురాలు అన్నపూర్ణ పున్నమి చందర్, కుర్ర శ్రీను, మూడు మగ్గితియా, కుర్ర రమేష్, పులి సింగ్, మహిళలు, పిల్లలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
Spread the love