పొట్టి కప్పు ప్రచారకర్త ఉసెన్‌ బోల్ట్‌

పొట్టి కప్పు ప్రచారకర్త ఉసెన్‌ బోల్ట్‌దుబాయ్ :
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఎనిమిది ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన ఆల్‌టైమ్‌ దిగ్గజం బోల్ట్‌.. కరీబియన్‌, యుఎస్‌ఏలో ప్రపంచకప్‌ మ్యాచులకు హాజరవటం సహా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘కరీబియన్‌ జీవనంలో క్రికెట్‌ అంతర్భాగం. క్రికెట్‌కు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. క్రికెట్‌, ప్రపంచకప్‌ గ్లోబల్‌ ప్రచారకర్తగా వ్యవహరించటం గొప్పగా ఉంది’ అని బోల్ట్‌ అన్నారు.

Spread the love