కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ వుండాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..?

– రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటుతో బుద్ది చెప్పాలి..
– హనుమంతుడు గుడి లేని ఊరు లేదు… కెసిఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు..
– గన్నారం లో పది కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానలు… ముక్తకంఠంతో బాజిరెడ్డికే మా ఓటు..
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూటకోర్ మాటలు నమ్మవద్దు..
– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ వుండాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..?,రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటుతో తగిన రీతిలో బుద్ది చెప్పాలని, హనుమంతుడి గుడి లేని ఊరు లేదు… కెసిఆర్ అందజేసిన సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని,గన్నారం గ్రామంలో పది కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ముక్తకంఠంతో బాజిరెడ్డి గోవర్ధన్  కే ఓటు వేసి గెలిపిస్తామని పత్రాలను అందజేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూటకోర్ మాటలు నమ్మవద్దని
 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందల్ వాయి మండలం గన్నారం, సిరికొండ మండలంలోని సిరికొండ, గడ్కోల్, ముషీర్ నగర్, హుస్సేన్ నగర్, మెట్టు మర్రి తండా, కొండూరు, తాళ్ల రామడుగు, గడ్డ మీది తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్  మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలను.. ఎట్ల మర్చిపోతం.. కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వక కళ్లల్లో ఒత్తులేసుకోని.. మడి తడుపుకోడానికి రాత్రుళ్లు జాగారం చేసి.. నిద్రలు లేక అన్నదాత అరిగోసలు పడ్డారు.. ఏనాడూ 3-4 గంటలు మించి వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు..ఆనాడు యాడ చూసినా కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు.. కరెంట్ కోసం రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్ల మీద దాడులే కనిపించేవి.. రాత్రుల్లో రైతన్నలు కరెంటు కోసం బావుల దగ్గరకు వెళ్లి కరెంట్ షాక్కు గురై ఎందరో రైతులు బలైపోయారు. కాంగ్రెస్ బిజెపి హయాంలో కానీ కెసిఆర్ పాలనలో ఇప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల, పుట్లకొద్ది ధాన్య రాశులుగా పండిస్తున్నారని, పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.ఇప్పటి వరకు నేను అభివృద్ధి చేశానని నమ్మితేనే మీరు ఓటు వేయండి.. చేసిన అభివృద్ధిలో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఇక నుంచి ప్రతి ఒక్కరూ నేరుగా తనవద్దకు వచ్చి అడగవచ్చని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే నాలాంటి నాయకుడు కావాలా…? లేదంటే పనులు కావాలంటే  నిజామాబాద్‌, హైదరాబాద్.. వెళ్లి చెప్పే పరిస్థితిలో ఉన్న నాయకుడు కావాలా..? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇప్పటి వరకు  మండలంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. మీరంతా ఆశీర్వదిస్తే నేను మీ తరఫున రెట్టింపు ఉత్సాహంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. రేటెంత రెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ… ఒకరిని విమర్శించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని…  రైతంగానికి మూడు గంటలు కరెంట్ సరిపోతుందా… రేవంత్ రెడ్డి వ్యవసాయం గురించి నీకు అవగాహన ఉందా…? రాబోయే ఎలక్షన్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు….ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదాన్ని , లాభాల బాట పట్టించడం జరిగిందని, ఆర్టీసీలో జీతం టిఏలు, డిఏలు తీసుకోకుండా పనిచేశా నన్నారు. బాజిరెడ్డి వ్యక్తిత్వం గురించి బస్ కండక్టర్ను బస్ డ్రైవర్ను రాష్ట్రంలో ఎక్కడ ఆపిన అడిగిన తన గురించి చెప్తారని రేవంత్ రెడ్డికి ఘాటుగా విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో ఒక్కరికైనా రైతుబంధు ఇచ్చారా కల్యాణ లక్ష్మి ఇచ్చారా రైతు బీమా ఇచ్చారా 2000 పెన్షన్ ఇచ్చారా.. కన్యల కల్యాణ లక్ష్మి ఇచ్చారా.. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఇచ్చే ముఖం లేదు కానీ… మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలే… కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసిన ఆరు గ్యారంటీలు అమలు కావు… ప్రజలను మభ్యపెట్టడం దొంగ హామీలు. అబద్ధ ప్రచారాలు.. ప్రజల అసలికే నమ్మవద్దు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ రైతన్న గానికి 24 గంటలు ఇవడం వల్ల వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలకు, ఉచిత ఆపరేషన్లు, ఉచిత కెసిఆర్ కిట్టులు మగ బిడ్డ పుడితే 6000 ఆడబిడ్డ పుడితే 12000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, ఇలాగే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలందరూ గురుకుల పాఠశాలలో సన్నబియ్యంతో పౌష్టిక ఆహారంతో  ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై ఐదు వేలు ఏడాదికి ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.కర్ణాటక రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేక రైతు కులాలన్నీ ఎండిపోయి పర్రెలు పాస్తున్నాయి అరిగోస పడుతున్నారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే ఆ విధంగా పరిపాలన సాగుతుందని వివరించారు. ప్రజలారా కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మవద్దని కేసీఆర్  గెలిస్తే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తారని తెలిపారు. ఎవరింట్లో అయితే పెన్షన్ వస్తలేదో ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చేలా వచ్చే ప్రభుత్వం రాగానే సౌభాగ్య లక్ష్మి కింద 3000 రూపాయలు అందిస్తామని,బీడీ పింఛన్దారులందరికీ పెన్షన్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కట్ అప్డేట్ ను ఎత్తివేయడం జరుగుతుందని, కేసీఆర్ డిచ్పల్లి భారీ బహిరంగ సభలో తెలిపారని గుర్తు చేశారు.  ఆడబిడ్డలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే  బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ,మాపై ఉందని అందరూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బీఅర్ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యం అని, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీ లు ప్రజలను మభ్య పెట్టే పార్టీ లు అన్నారు.40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమి లేదని, బీజేపి కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి నయ పైసా ఇవ్వలేదని అటువంటి పార్టీ లను ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు. మండల గ్రామాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారానికి  భారీ సంఖ్యలో కార్యకర్తలు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రూరల్ బిఅర్ఎస్ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, వివిధ మండలాల జడ్పిటిసిలు గడ్డం సుమన రవిరెడ్డి, ఎంపీపీలు బాదవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య,సొసైటీ చైర్మన్లు చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి,మండల పార్టీ అద్యక్ష, ప్రధాన కార్యదర్శి చిలువెరి దాస్, పులి శ్రీనివాస్, సర్పంచ్,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, రఘునథన్ రాము,రాజేందర్, డాక్టర్ రాజేష్, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, ఎస్సీ రూరల్ కన్వీనర్ పాశం కుమర్, పులి వసంత, శ్రీనివాస్ గుప్త,అంబర్ సింగ్, ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు   అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
Spread the love