నవతెలంగాణ – రామారెడ్డి
నేటి నుండి శ్రావణమాసం పురస్కరించుకొని మండలంలోని ఏసన్న పల్లి రామారెడ్డి లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి, మద్దికుంట లో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తి చేసింది. మద్దికుంట ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహిస్తున్న అందున, పాల్గొనే భక్తులు ఆలయ కమిటీకి సమాచారం అందించాలని సూచించారు. ప్రత్యేక పూజలు అత్యధికంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరుతుంది.