
మోపాల్ మండలంలోని బోర్గాం (పి) గ్రామంలో గల సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి దాతలు ఈగ రమేష్ రెడ్డి మరియు చింతకాయల రాజేందర్ వెండి నెమలి విగ్రహం చేయించి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేవ కార్యానికి ఎల్లప్పుడూ చేయూతనిందస్తున్న దాతలకు ప్రత్యేకంగా అభినందించాడు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, ఈగ శ్రీనివాస్ రెడ్డి ,నారాయణ తదితరులు పాల్గొన్నారు.