సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మ రమేష్ రెడ్డిపై వేటు.?

– సహకార చట్టానికి  విరుద్ధంగా వ్యాపారం చేసినందుకేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మ రమేష్ రెడ్డి పిఏసిఎస్ లో ఒక సభ్యుడై ఉండి, సొసైటీ ఆదాయానికి గండి కొట్టేలా సహకార చట్టానికి విరుద్ధంగా ప్రయివేటు ఎరువుల, విత్తనాల వ్యాపారం చేస్తున్నందుకు డిసిఓ వేటు వేసినట్లుగా తెలుస్తోంది.పిఏసీఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సొసైటీ ఆదాయం పెంచడానికి, అభివృద్ధికి కృషి చేస్తాము,రైతులకు సొసైటీ ద్వారా ఎరువులు,విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతామని ప్రతిజ్ఞ చేసిన విషయం విదితమే. అయితే రమేష్ రెడ్డి పిఏసిఎస్ లో ఒక సింగిల్ విండో డైరెక్టరై ఉండి సొసైటీ ఆదాయానికి గండికొట్టేలా,సహకార చట్టానికి విరుద్ధంగా కొయ్యుర్ ప్రయివేటుగా ఎరువుల,విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లుగా, డిసిఎంఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లుగా  సొసైటీలో ఉన్న కొంతమంది సభ్యులు ఇటీవల ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి డిసిఓ డి. శైలజ పూర్తి విచారణ చేపట్టి ఈ నెల 2న రమేష్ రెడ్డికి  సహకార సంఘం యాక్ట్ 1964 ప్రకారం వేటువేసి సస్పెన్షన్ షోకాజ్ నోటీస్ చేసినట్లుగా తెలిసింది.
Spread the love