Sunday, July 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయాలకతీతంగా ‘సర్‌’ నిర్వహించాలి

రాజకీయాలకతీతంగా ‘సర్‌’ నిర్వహించాలి

- Advertisement -

తెలంగాణలో ఓట్ల తొలగింపు
 కుటిలయత్నాలు చెల్లవు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
సర్‌ ఫారంలో సంక్లిష్టతలను తొలగించాలి: ప్రొఫెసర్‌ వెంకటనారాయణ
కేయూలో సర్‌‌పై అవగాహన కార్యక్రమం


నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాజకీయాలకతీతంగా ‘సర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సూచిం చారు. శనివారం ఫూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ అధ్యక్షతన ‌సర్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చైతన్యవంతమైన తెలంగాణలో మిగతా రాష్ట్రాల మాదిరి గా ఓటర్ల తొలగింపు కుటిలయత్నాలు చెల్లవన్నారు. వారం రోజుల పాటు ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ‘సర్’ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నదన్నారు. తమ నియోజకవ ర్గంలో బీఎల్ఓలు, బీఎల్‌ఏల సహకారంతో ఇప్పటివరకు 58 శాతం సర్ ప్రక్రియ పూర్తి చేయించామన్నారు. ఇంకా వారం రోజుల సమయంలో 80 శాతం ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఓటు ద్వారానే మన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నందున అర్హులందరూ సర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు విద్యార్థులు, మేధావులు,అన్ని వర్గాల వారు ఓటు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని ఆయన అభ్యర్థించారు.

ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆగస్టు 3 వరకు ఈ ప్రక్రియ పూర్తికానుందని, ఆగస్టు 8వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుందని వివరించారు. 141 కోట్ల జనాభాకు సర్ ప్రక్రియ కొనసాగుతుందని, రెండో విడతలో ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ సర్ ఫారంలోని సంక్లిష్టతలను తొలగించాలన్నారు. యువత పౌర సమాజం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఆర్. ఉమామహేశ్వర్ మాట్లాడారు. సర్ ప్రక్రియ ఫై మీడియా ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాల్సి ఉందన్నారు. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా అభ్యంతరాలు ఉంటే పరిష్కరింప చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం బలోపేతం కోసం సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ‌తెలంగాన అకాడమీ చైర్మెన్‌ ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో కేయూ మాజీ రిజిస్ట్రార్ సదానందం, డాక్టర్ కూరపాటి రమేష్, పాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు యాదవ్, ఉపాధ్యాయులు దామేర ఉపేందర్, రాజ్ మహమ్మద్, పాస్ నాయకులు డాక్టర్ తాడూరి శాస్త్రి, గొడిశాల సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నల్లారి శ్రీనివాస్, జర్నలిజం విభాగం అధ్యాపకులు కంజర్ల నరసింహారాములు, డాక్టర్ వంగాల సుధాకర్, డాక్టర్ సంపత్ కుమార్, డి.రామాచారి, డాక్టర్ మోటె చిరంజీవి, సురేందర్, శ్రవణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -