నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రౌలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంస్థలు చేస్తున్న సహాయక కార్యక్రమాలను సమీక్షించాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధీర్ రంజన్ చౌదరిని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశించారు.