రైతు దినోత్సవ వేడుకల్లో

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రతి ఒక్కరూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ అబిడ్ బేగ్ సూచించారు. శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహిస్తున్న రైతు దినోత్సవ వేడుకల్లో వచ్చిన రైతులకు నసురుల్లాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, లోన్ యాప్, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్ లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లాంటి పోస్తులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి మాట్లాడుతూ పంట డబ్బులు బ్యాంక్ నుంచి తీసుక వెళ్ళేటప్పుడు, ఎరువుల కోసం డబ్బులు తీసుక వెళ్ళేటప్పుడు రైతులు జాగ్రత ఉండాలని, అవసరం అనుకుంటే కుటుంబ సభ్యులను తోడు తీసుక వెళ్లాలని సూచించారు.
బ్యాంకు అధికారులుగా మాట్లాడేవారిని, రుణాలు ఇస్తామని చెప్పే వారిని నమ్మొద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే డయల్‌ 100కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపరిచితుల మాటలను నమ్మొద్దని, వారికి ఎలాంటి వివరాలు చెప్పొద్దని, మోసపూరిత ఫోన్‌ కాల్స్‌, మెసెజ్‌లకు స్పందించకూడదన్నారు. అవగాహనతోనే ఆన్‌లైన్‌, సైబర్‌ మోసాలను అడ్డుకోవచ్చని ఏఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బుజ్జి, కానిస్టేబుల్ రఘు, అంజయ్య, అధికారులు, రైతులు, ప్రజలు ఉన్నారు.

Spread the love