మండల కేంద్రంలో సౌడమ్మ బోనాలు యాదవ సంఘం ఆద్వర్యంలో మంగళవారం నాల్గవ రోజు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మైల పోలు, బియ్యం సుంకు పట్టుట, సాయంత్రం 5-00 గంటలకు బోనాలు కార్యక్రమాలు చేపట్టారు. బోనాలతో గ్రమంలోనిన్ప్రదన్ విడులంకుండ్ శోభాయాత్ర నిర్వహిస్తూ ఆలయానికి చేరుకున్నారు. డోలు చప్పుళ్ళతో, డీజే ఏర్పాటు చేసి యువకులు నృత్యాలుం చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.