విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
వివరాలు వెల్లడించిన
ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వికారాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తునన ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు సంబంధించిన వివరాలను వికారాబాద్ పట్టణంలోని పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశం ఇచ్చిన నమ్మ కదగిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం ఐదు గంటల సమయంలో వికారాబాద్ ఎస్‌హెచ్‌ఓ టంగుటూరి శ్రీను ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని ఎన్నిపల్లి చౌరస్తాలో తనికీలు నిర్వహించారు. ఒక వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను బాపట్ల కు చెందిన జాగర్లమూడి శ్రీనివాస్ రావు అని చెప్పాడు. అతని చేతిలో ఉన్న రెండు బ్యాగులు చెక్ చేయగా అందు లో కేజీ చొప్పున పత్తి విత్తనాలు ప్యాకెట్లు సుమారు 25 వరకు కనిపించాయి. వాటి గురించి వివరాలు అడిగారు. తాను మంత్రాలయం దగ్గరలో ఎమ్మిఘనూర్ గ్రామంలో గత సంవత్సరం పెద్ద ఎత్తున సదానంద్ బ్రాండ్ చెందిన హెచ్‌టీ కాటన్ విత్తనాలను పండించినానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఈ విత్తనాలకి మంచి డిమాండ్ ఉందని తెలుసుకొని పండించిన పత్తిని కర్నూల్ లో జిమ్మింగ్ చేసి సుమారు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని రెడీ చేసుకుని దానికి గులాబీ రంగు తిమైతోజీన్ 30శాతం రసాయనాన్ని కలిపినట్టు తెలిపారు. వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల్లో రైతులకు విక్ర యించాలని ఉద్దేశంతో తెలంగాణ సరిహద్దు గ్రామమైన కర్నాకట రాష్ట్రంలోని ముధెల్లి మండలలోని వీర్లపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం నుంచి ఒక రూమ్‌ని అద్దెకు తీసుకున్నట్టు తెలిపారు. అందులో సుమారు 10 క్వింటాళ్ల వరకు పత్తి విత్తనాల ప్యాకెట్‌లను దాచి, ఈ విత్తనాలను మార్కెటింగ్ చేసుకుందామనే ఉద్దేశంతో శుక్రవారం ఉదయం శాంపిల్స్ తీసుకొని రైతులను కలిసేందుకు వచ్చినట్టు చెప్పాడు. అయితే ఈ క్రమంలో నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతని దగ్గర నుంచి సుమారు 25 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనపరచుకున్నారు. వికారాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్‌తో తనిఖీ చేయించగా అవన్నీ నకిలీ విత్తనాలుగా నిర్ధారణమైన తర్వాత ఇన్స్‌స్పెక్టర్ వికారాబాద్ టౌన్ టి.శ్రీను కర్నాటక రాష్ట్రంలోని ముధెల్లి మండలంలో ఈర్లపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ నింది తుడు దాచిపెట్టిన సుమారు 9.75 క్వింటాల్స్ నకిలీ పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నాడరు. అలాగే రెండు రోజుల కిందట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మోమిన్‌పేట మండలంలో ఇదేవిధంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతూ పట్టు బడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను కూడా కర్నాటక రాష్ట్రంలోని మొదల్లి మండలం ఈడికె గ్రామంలో రూమ్‌ని కిరాయి తీసుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తు న్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి ఇరువురిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేసిన వికారాబాద్ ఎస్‌హెచ్‌ఓ టంగుటూరి శ్రీను, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశంలను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.