రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

నవతెలంగాణ – రుద్రంగి
రుద్రంగి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని బ్లూకోట్స్‌ టీమ్‌లు 24 గంటలపాటు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ అధికారులు తరచు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ సమగ్ర సమాచారాన్ని సేకరీంచాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులంతా,నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా పర్యటిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.స్టేషన్ పరిధిలోగల సమస్యాత్మక,సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట సిఐ వెంకటేశ్వర్లు,ఎస్ఐ అశోక్ ,సిబ్బంది ఉన్నారు.
Spread the love