బీట్ ఆఫీసర్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్

నవతెలంగాణ – రుద్రంగి
అటవీశాఖ బీట్ ఆఫీసర్ పై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 16 న రుద్రంగి ఫారెస్ట్ బీట్ అధికారి అయిన ఎస్.బాలకృష్ణ,ఫారెస్ట్ వాచర్ అయిన గద్దరశి రాజుతో కలిసి మానాల పరిసర ప్రాంతాలలోని అడ్డబోర్ తండా గ్రామ సమీపంలో అడవిలో గస్తీ నిమిత్తం తిరుగుచుండగా అడ్డ బోర్ తండా గ్రామానికి చెందిన లావుడ్యా  సంతోష్, అనే వ్యక్తి,వారిని అడ్డగించి, బూతు మాటలు తిట్టి రాళ్లతో దాడి చేయగా ఫారెస్ట్ అధికారి బాలకృష్ణకు  అతనితో పాటు ఉన్న రాజుకు గాయాలయ్యాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు పై ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన సంతోష్ పై కేసు నమోదు చేసి  నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love