కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభించారు. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ఒకదాని కొకటి 10 వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయలైనట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love