బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్న వేళ.. కేటీఆర్ కీలక ప్రకటన..!

నవతెలంగాణ -హైదరాబాద్: బీఆర్ఎస్‌లో తాజా పరిణామాలపై ‘ఎక్స్’ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్‌దన్నారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారన్నారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామని.. పోరాట పంథాలో కదం తొక్కుతామని కేటీఆర్ తెలిపారు.

Spread the love