కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభం..

నవతెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణ భ‌వ‌న్ నుంచి పోరుయాత్ర‌కు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భ‌వ‌న్‌కు చేరుకున్న కేసీఆర్‌కు మ‌హిళ‌లు మంగ‌ళ‌హారతుల‌తో ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. మొద‌ట‌ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు కేసీఆర్. అనంత‌రం కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకున్నారు. నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.

Spread the love