
శనివారం రోజు మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదిక లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛధనం కార్యక్రమం పై మండల స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ మరియు ఎంపీడీవో రాములు మండలంలోని అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశ అనుసారం ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదటి రోజున గ్రామసభలు నిర్వహించాలి రెండవ రోజున త్రాగునీరు మరియు వర్షపు నీరు సంరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించాలి. అలాగే మిగతా రోజులలో కాలువల గురించి ఆరోగ్యం పరిశుభ్రత గురించి ప్రభుత్వ సంస్థలు మరియు కార్యాలయాల శుభ్రత గురించి అలాగే అతి ముఖ్యమైనటువంటిది హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్ గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలి అలాగే వాటిని సంరక్షించే విధంగా కూడా చూడాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ కిరణ్ కుమార్ అలాగే గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు మరియు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ,అంగన్వాడీ టీచర్లు ,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.