– సర్పంచ్ పాండురంగయ్య
నవతెలంగాణ-చౌడాపూర్
మండల పరిధిలోని మరికల్ గ్రామంలో సోమవారం సర్పంచ్ పాండు రంగయ్య వర్షం కోసం సోమవారం శివాలయంలో పూజలు నిర్వహించారు. గ్రామంలో గతంలో కురిసిన వర్షాలకు రైతులు జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, తదితర పంటలు సాగు చేశారు. పంటలు సాగు చేసినప్పటి నుంచి సరైన వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని గ్రామ ప్రజలు సుఖసం తోషాలతో ఉండాలని శ్రావణమాసం మొదటి సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.