రూ.2 కోట్ల విలువైన స్పిరిట్‌ పట్టివేత

– కెమికల్స్‌ కంపెనీపై ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడి
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
ఓ కెమికల్స్‌ కంపెనీపై ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేసి.. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.2 కోట్లా 31 లక్షల విలువ గల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలో జగదాంబ కెమికల్స్‌ కంపెనీపై గురువారం ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ 105 బ్యారెల్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 21 వేల లీటర్ల రా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హనుమాన్‌ రామ్‌, శ్రావణ్‌ కుమార్‌ను అరెస్టు చేసి వారిపై 31 ఏ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Spread the love