క్రీడలు మానసిక ఉత్సాహానికి తోడ్పడతాయి

– మైనార్టీ నేత ఇక్బాల్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
క్రీడలు మానసిక ఉత్సాహానికి ఎంతగానో దోహదపడతాయని మైనార్టీ నేత మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. శివరెడ్డిపేటలో మహబూబ్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ జిల్లా వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇ క్బాల్‌ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమని అ న్నారు. క్రీడల్లో రాణిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిం చారు. స్నేహపూర్వకంగానే క్రీడలు ఆడాలని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తు, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love