ఎస్సీ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

నవతెలంగాణ- నవీపేట్: నవీపేట్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాగలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత నారాయణ కళాశాల వినాయక్ నగర్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించి అర్హులైన వారికి స్పాట్ అడ్మిషన్ చేస్తారని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ టిసి, కుల ధ్రువీకరణ మరియు ఆదాయ పత్రాలు తీసుకొని రావాలని అన్నారు. పూర్తి వివరాలకు 7995010657 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.
Spread the love