నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఆర్ డబ్ల్యు ఎస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఏఈ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బంది శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించి జ్ఞాపికలను అందించారు. సిబ్బంది నాయకుడు బాలు, వెంకట్, సవిత మాట్లాడుతూ ఏఈ ఉన్నప్పుడు మాకు పలు సూచనలు చేసి మమ్మల్ని ఎండాకాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో తాము కూడా అధికారులకు సహకరించి, విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతము జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాలలో నీటి కొరత లేకుండా తామంతా ఏకతాటిపై ఉంటూ విధులు నిర్వహించడం వల్ల విజయవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. 7 , 8 ఏళ్ల క్రితం నీటి సమస్యలతో పలు గ్రామాలు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉండేరని ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించి సస్య సామలము చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలు, వెంకట్, బాలయ్య, సవిత, బాలాజీ, యాదు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్ డబ్ల్యూఎస్ ఏఈని సన్మానించిన సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



