ఇల్లు లేని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి: బి వెంకట్

– అఖిలభారత వ్యవసాయక కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ 
నవతెలంగాణ – భిక్కనూర్
ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు.   బుధవారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో భూ సాధన సభలో పాల్గొని నిరుపేద కుటుంబాలకు నిర్మించిన గృహాలకు గృహప్రవేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రకటించిన 5 లక్షల రూపాయలను జంగంపల్లి గ్రామస్తులైనటువంటి మల్లు స్వరాజ్యం కాలనీలో నివసిస్తున్న వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయంలో కొనుగోలు చేసిన భూమిని 2008లో ఎర్రజెండా పోరాట ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చి స్థలాలు చూయించడం జరిగిందని, వాటిలో గత రెండు సంవత్సరాలుగా జంగంపల్లి ప్రజలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడన ఇల్లను నిర్మించుకొని ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. పోరాటానికి ఎల్లవేళలా సహాయ సహకార అందిస్తామని స్టేజ్ పైనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఫోన్ చేసి మల్లు స్వరాజ్యం కాలనీలో నివసిస్తున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. రైతుబంధు పథకం లాగ కూలి బందు పథకం కూడా ప్రకటించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట రాములు మాట్లాడుతూ నివాసం ఉంటూ పోరాటం కొనసాగిస్తున్న వారికి పట్టాలు ఉండి ప్రభుత్వం చూయించిన స్థలాలలోనే నివాసం ఉంటున్నారని వీరి జోలికి రావద్దని వీరికి హైకోర్టు ఆర్డర్ ఉందని తెలిపారు. పేద ప్రజల జోలికి వస్తే ఎర్రజెండా ఊరుకోదు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంతో పాటు గ్రామాలలో అనేక ఇబ్బందులు గురి చేశారని వాటిని మానకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి పద్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, సిఐటియు జిల్లా నాయకులు సురేష్ కొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు, నాయకులు పేరం నరసభ, నారాయణ, రుద్ర బోయిన నర్సింలు, ప్రవీణ్, దేవరాజ్, జయ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love