వాటర్ ట్యాంక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

– డ్రైవర్ పరిస్థితి విషమం, పదిమందికి గాయాలు
నవతెలంగాణ – భిక్కనూర్
వాటర్ ట్యాంకర్ ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా పదిమంది ప్రయాణికులకు గాయాలైన ఘటన భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో గురువారం  చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిఎంఆర్ సంస్థకు సంబంధించిన వాటర్ ట్యాంకర్ 44వ జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు సూచిక బోర్డులను ఏర్పాటు చేసుకొని నీళ్లు పోస్తుండగా, హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాటర్ ట్యాంకర్ ను వెనక నుండి ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా డ్రైవర్ గోపాల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన ప్రయాణికులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు, వాటర్ ట్యాంకును జాతీయ రహదారి నుండి పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడం కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సంపత్, ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
Spread the love