హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దుచేయాలనీ దేశ వ్యాప్త ఆందోళనలు

– ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ – సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
రవాణా రంగ  డ్రైవర్లను కఠినంగా శిక్షించే  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “హిట్ అండ్ రన్ చట్టాన్ని  రద్దు చేయాలనీ  ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్  అధ్వర్యంలో దేశ వ్యాప్త ఆందోళనలకు కేరళలోని త్రివేండ్రంలో జరిగిన  కేంద్ర కమిటి సమావేశాలలో పులుపు నివ్వడం జరిగిందని కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం తెలియజేశారు. ఫిబ్రవరి 27,28 తేదీలలో కేరళలోని త్రివేండ్రంలోని ఈఎంఎస్  నంబూద్రి పాద్ అకాడమీ లో జరిగిన ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కేంద్ర కమిటి సమావేశాలలో పలు తీర్మానాలు చేయడం జరిగిందనీ తెలియజేశారు. ఈ సమావేశాలలో తెలంగాణతో పాటు 25 రాష్ట్రాల నుండి ప్రతినిదులు  హాజరైనారని, ట్రాన్స్ పోర్ట్ కార్మికుల సమస్యలపైన చర్చించి ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరిగిందనీ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి కార్యక్రమాల రిపోర్ట్ ను కేంద్ర కమిటి సభ్యులుగా కల్లూరి మల్లేశం ప్రవేశ పెట్టడం జరిగిందని తెలియజేశారు. “భారత న్యాయ సంహిత” చట్టం సెక్షన్ 106(1)(2 ) బిల్లు రోడ్ ప్రమాదాలు జరిగిన  సమయంలో డ్రైవర్లు ప్రాణ భయంతో రక్షణ కోసం స్పాట్ లో ఉండకుండా వెళ్లిపోతే   “హిట్ అండ్ రన్” కింద  7 లక్షల వరకు  జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ చట్టం తెచ్చారని ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశ వ్యాప్త ఆందోళనలకు,సంతకాల సేకరణకు పిలుపునిచ్చారని తెలియజేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులకు నష్టం చేసే మోటర్ వాహన చట్టం – 2019 నీ తీసుకువచ్చారని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్పాలని రవాణా రంగ కార్మికులు ఇంటి ఇంటికి తిరిగి మోడీ వ్యతిరేక ప్రచారం నిర్వహించాలని కేంద్ర కమిటి సమావేశాలు తిర్మానించాయని తెలియజేశారు.  ఈ కేంద్ర కమిటి సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం నుండి నాతో పాటు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్,నాయకులు కలువాల అజయ్ బాబు, జాజుల రుద్ర కుమార్ లు పాల్గొన్నారు.
Spread the love