రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ కుమార్ మృతి తీరని లోటు 

State President Sanjeev Kumar's death is an irreparable loss– చిత్రపటానికి ఘనంగా నివాళి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ కుమార్ అకాల మరణం అందరికీ తీరని లోటని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శనివారం మండల కేంద్రంలో సంజీవ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ కుమార్ అందించే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఉపాధి హామీ పథకం ఏపీవో విద్యానంద్, టెక్నికల్ అసిస్టెంట్లు అరవింద్, మారుతి, మంజురాణి, కంప్యూటర్ ఆపరేటర్ సబితా, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అశ్వపతి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love