అల్లోపతి, ఆయుష్ మధ్య స్టైఫండ్ వ్యత్యాసాన్ని తొలగించాలి
24 రోజులుగా కొనసాగుతున్న సమ్మె
ప్రభుత్వం వెంటనే విరమింపజేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
చార్మినార్ వద్ద ఆయుష్ విద్యార్థుల ర్యాలీ
నవతెలంగాణ-చార్మినార్
ఆయుష్ వైద్య కళాశాలల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ, యూజీ విద్యార్థుల స్టైఫండ్ పెంచి న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయుష్ వైద్య విద్యార్థులు గురువారం హైదరాబాద్ చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆస్పత్రి నుంచి మదీనా చౌరస్తా వరకు ప్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన విద్యార్థుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లా డుతూ.. వేలాది మంది ఆయుష్ వైద్య విద్యార్థులు 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గ మన్నారు. తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యార్థులకు అందుతున్న స్టైఫండ్ అత్యంత తక్కువగా ఉందని తెలిపారు. అల్లోపతి వైద్య విద్యలో ఎంబీబీఎస్ విద్యార్థులకు సుమారు రూ.30 వేలు, పీజీ విద్యార్థులకు రూ.60 వేలు, హౌస్ సర్జన్లకు రూ.70 వేల వరకు స్టైఫండ్ అందుతుండగా.. ఆయుష్ విద్యార్థులకు యూజీ స్థాయిలో రూ.13 వేలు, పీజీ విద్యార్థులకు రూ.30 వేలు, హౌస్ సర్జన్లకు రూ.35వేలు మాత్రమే ఇస్తున్నా రని వివరించారు. ఇది తీవ్ర వివక్షకు నిదర్శనమన్నారు. ఒకే వైద్య రంగంలో పనిచేస్తున్న విద్యార్థులకు రెండు రకాల స్టైఫండ్ విధానాలు అమలు చేయడం అన్యాయమన్నారు. అల్లోపతి, ఆయుష్ వైద్య విద్యార్థుల మధ్య ఉన్న స్టైఫండ్ వ్యత్యాసాన్ని పూర్తిగా తొలగించి సమాన త్వం పాటించాలని డిమాండ్ చేశారు.
2016 నుంచి ఆయుష్ వైద్య విద్యార్థుల స్టైఫండ్‌లో సరైన పెంపు లేకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విద్య, వసతి, ప్రయాణ ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత స్టైఫండ్ సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడటంలో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఆయుష్ ఆస్పత్రుల నిర్వహణలో విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల సేవలు ఎంతో ముఖ్యమన్నారు. ఆయుష్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మె కొనసాగితే రోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహ రించి విద్యార్థులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఆయుష్ వైద్య విద్యార్థుల సమ్మెకు సీపీఐ(ఎం), సీఐటీయూ, ఆవాజ్ నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. మీనా, సీఐటీయూ మాజీ కార్యదర్శి జి. విట్టల్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
ఆయుష్ విద్యార్థులస్టైఫండ్ పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



