గో హత్య నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై శ్రీకాంత్

నవతెలంగాణ – మద్నూర్

ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు గోహత్య నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ శ్రీకాంత్ శాంతి కమిటీ సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 17న జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్య జరపరాదని తెలియజేశారు. పండుగ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం నాడు శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. హిందూ ముస్లిం నాయకులకు సోదరులకు ప్రత్యేకంగా సమావేశపరిచారు గో హత్య గురించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఎస్సై తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశు వైద్యులు మాట్లాడుతూ.. ఆవులు ఎద్దులు, కోడెలు దూడలు ఎలాంటి పశువు అయినా హత్య చేసే అధికారం ఎవరికి లేదని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్య నేరమని తెలియజేశారు. పండుగ శాంతియుతంగా జరుపుకునేందుకు హిందూ ముస్లిం సోదరులు సహకరించాలని, ఈ సమావేశంలో ఎస్సై పశువైద్యులు తెలియజేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని అక్రమంగా పశువులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటుచేసిన శాంతి కమ్యూనిటీ సమావేశంలో ఆల్ పార్టీల నాయకులు హిందూ ముస్లింలు పాల్గొన్నారు.
Spread the love