– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ – బోనకల్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మధిర డివిజన్ ఇంచార్జి పాలడుగు భాస్కర్ అన్నారు. మండల పరిధిలోని తూటికుంట గ్రామంలో తూటికుంట్ల జోన్ సమావేశం లక్ష్మీపురం ఉప సర్పంచ్ గుడ్డురి ఉమ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వం ఆధారంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక, రైతు హక్కుల చట్టాలను బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేయటమే సీపీఐ(ఎం) లక్ష్యమన్నారు. ఇందుకు కలిసివచ్చే లౌకిక పార్టీలతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసినా, ఆ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట తప్పదన్నారు. తమ పోరాటం ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, పార్టీ మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, సిపిఎం తూటికుంట్ల గ్రామ శాఖ కార్యదర్శులు పాపినేని రమేష్, పాపినేని అప్పారావు, పాపినేని వెంకట్రావు, నాయకులు నోముల పుల్లయ్య, సిపిఎం లక్ష్మీపురం గ్రామ శాఖ కార్యదర్శి గుడ్డూరు వెంకట నరసయ్య, రెండు గ్రామాల పార్టీ సభ్యులు ప్రజాసంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.