మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ సాధారణ సమావేశం. స్వపక్ష, విపక్ష, కౌన్సిలర్లు కోరగా వాయిదా వేయడం జరిగిందని బిజెపి ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఎజెండాలోని 14 వ అంశం 10 లక్షల రూపాయలు మోడల్ స్కూలుకు మొరంకు కేటాయించినట్లుగా పేర్కొనగా పిల్లలు చెందా చేసి మొరం రోడ్డు వేసినారు కదా అని ప్రశ్నించగా 4 లక్షల 71 వేల రూపాయలు షబ్బీర్ అహ్మద్ అనే కాంట్రాక్టర్ కు ఇచ్చినట్లు తెలపడం జరిగినది, మరి 10 లక్షల రూపాయలు ఎందుకు పెట్టినారు అనే ప్రశ్నించగా… జవాబు లేదు, డీజిల్కు, మోటార్ రిపేర్లకు, కోట్ల రూపాయలు, మొక్కలకు వాటర్ ట్యాంకర్లకు, కోట్ల రూపాయలు, అక్రమంగా కమిషన్ల కొరకు ఇష్టారీతిన సాధారణ నిధులను  కేటాయించడం ను వ్యతిరేకించడం జరిగింది. తక్షణం మే, కలెక్టర్ స్పందించి ప్రజా సమస్యల అభివృద్ధిపై చర్చించే విధంగా వెంటనే సమావేశం నిర్వహించాలని కమీషనర్నుకు ఈ రోజున మెమోరండం ఇవ్వడం జరిగినది. జిల్లా కలెక్టర్ …. ఎమ్మెల్యే ల స్వపక్షంకు చెందిన కౌన్సిలర్లు, వాయిదా వేయాలనీ… మైనార్టీ కౌన్సిలర్లు మీటింగ్ ను బహిష్కరించినా… స్పందించకపోవడం దారుణం.  మున్సిపల్ ఆఫీసును రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మార్చి షాడో చైర్మన్ ఇష్టారేతిన వ్యవహరిస్తున్నా… జిల్లా కలెక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యం ను ఖూని చేయడమే..? అని ప్రశ్నించారు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసినారు మున్సిపల్ కమిషనర్ కు ఇట్టి కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ జీ.వీ. నరసింహారెడ్డి , కౌన్సిలర్లు, బయావత్ సాయికుమార్ , కొంతం మంజుల మురళీధర్ , ఆకుల సంగీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love