తాహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ అల్లం రాజకుమార్ జెండా ఆవిష్కరించి అందరితో జాతీయగీతం ఆలపించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పోలీసుల కవాతు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. జెండా ఆవిష్కరణకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులను స్మరించి జోహార్లు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ జే మమత తోపాటు కార్యాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love